కేసీఆర్‌ జీ.. మీరు గొప్పగా పోరాడుతున్నారు: తెలంగాణ సీఎంకు ఉద్ధవ్‌ ఠాక్రే ఫోన్‌

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశం..

Updated : 16 Feb 2022 12:18 IST

హైదరాబాద్‌: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశం కోసం కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్‌ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్‌కు ఆయన ఫోన్‌ చేశారు. ముంబయి రావాలని.. తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆహ్వానించారు. 

‘‘కేసీఆర్‌ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం" అని కేసీఆర్‌తో ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం నేపథ్యంలో ఈనెల 20న కేసీఆర్‌ ముంబయి వెళ్లనున్నారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్‌లో ఎలా కలిసి ముందుకెళ్లాలనే అంశాలపై వీరిద్దరూ ఆ భేటీలో చర్చించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని