Maharastra: నాపై నిఘా.. కాంగ్రెస్‌ చీఫ్‌ ఆరోపణ

మహారాష్ట్రలోని మహా అఘాఢీ ప్రభుత్వం (MVA)లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా కూటమిలో ఒకటైన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే.. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రిపై విమర్శలు గుప్పించారు.

Published : 12 Jul 2021 19:08 IST

ముంబయి: మహారాష్ట్రలోని మహా అఘాఢీ ప్రభుత్వం (MVA)లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా కూటమిలో ఒకటైన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే.. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రిపై విమర్శలు గుప్పించారు. తనపైనా, తన పార్టీ నేతలపైనా గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, హోంమంత్రి దిలీప్‌ వాస్లే రోజూ ఉదయం 9 గంటలకు సమావేశమై కాంగ్రెస్‌ నేతల సమావేశాలు, వారి వ్యాఖ్యలపై సమాచారం తెప్పించుకుంటున్నారని నానా పటోలే ఆరోపించారు. తన ఫోన్‌ను సైతం ట్యాప్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. తాను ఎక్కడికెళ్లినా, ఏం మాట్లాడినా ఆ వివరాలు వెంటనే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రికి చేరిపోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఎదుగులను సహించలేకే కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2016-19 మధ్య తన ఫోన్‌ ట్యాపింగ్‌ గురైందంటూ పటోలే గతంలో ఆరోపించారు. ఈ అంశంపై ఇటీవల ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంతో ఇప్పుడు సొంత ప్రభుత్వంపైనే పటోలే ట్యాపింగ్‌ ఆరోపణలు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని