IND vs AUS: జింఖానా ఘటన.. హెచ్‌సీఏ, ప్రభుత్వ వైఫల్యమే: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ), రాష్ట్ర ప్రభుత్వం కలిసి క్రీడాకారుల మనోభావాలను

Published : 24 Sep 2022 16:31 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ), రాష్ట్ర ప్రభుత్వం కలిసి క్రీడాకారుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. టికెట్ల వ్యవహారం హైదరాబాద్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని విమర్శించారు. మార్కెట్‌లో ఎన్ని టికెట్లు పెట్టారు? ఎన్ని అమ్ముడుపోయాయనే దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పే మాటల్లో పొంతన లేదన్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘టికెట్ల విక్రయ విషయంలో ప్రభుత్వం, హెచ్‌సీఏ విఫలమయ్యింది. టికెట్లు కొనుగోలు చేయడానికి వచ్చిన వారిపై పోలీసులు ఎందుకు లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది? ప్రభుత్వం అండదండల వల్లే ఈ తతంగమంతా జరిగింది. ఈ వ్యవహారంలో దోషులు ఎవరున్నా శిక్షించాల్సిందే. వ్యక్తులు, పార్టీలతో సంబంధం లేకుండా దోషులను శిక్షించాలి. రేపటి మ్యాచ్‌ సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించాలి. క్రీడాకారులకు, అభిమానులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది’’ అని మహేశ్ కుమార్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts