Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పలువురు భారాస నేతలు గురువారం కాంగ్రెస్‌ గూటికి చేరారు.

Updated : 28 Sep 2023 22:45 IST

దిల్లీ: పలువురు భారాస నేతలు గురువారం కాంగ్రెస్‌ గూటికి చేరారు. మల్కాజిగిరి భారాస ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్‌, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్‌ కుమార్‌ దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి ఖర్గే కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. న్యూదిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. సర్వేల ఆధారంగా అధిష్ఠానమే సీట్లను నిర్ణయిస్తుందని చెప్పారు. భారాసలో ఎంత చేయాలో తను అంతా చేశారని.. కార్యకర్తలంతా తనతోనే ఉన్నారని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు