Mallikarjun Kharge: జీ20 కాదు జీ2: ఖర్గే వ్యంగ్యాస్త్రాలు.. తిప్పికొట్టిన భాజపా
Parliament Special Session: పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge).. భాజపాపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీనిపై కమలం పార్టీ అంతే దీటుగా స్పందించింది.
దిల్లీ: పార్లమెంట్ ‘ప్రత్యేక’సమావేశాల్లో(Parliament Special Session) కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం విధానాలపై విమర్శలు గుప్పించింది. ఇటీవల జరిగిన జీ20 సదస్సును ఉద్దేశిస్తూ.. జీ2 అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) వ్యంగ్యంగా స్పందించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జీ20 గ్రాండ్ సక్సెస్ అయిందని భాజపా చెప్తుండగా.. ఆయన ఈ పదం వాడారు.
‘మనం జీ2 గురించి మాట్లాడుతూ బిజీగా ఉన్నాం. కానీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాత్రం మాట్లాడటం లేదు’ అని ఖర్గే ప్రభుత్వం తీరును విమర్శించారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖడ్ వెంటనే స్పందిస్తూ.. అది జీ2 కాదు జీ20 అని సవరించారు. అందుకు ఖర్గే తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు. జీ20లో సున్నాను కమలం (భాజపా ఎన్నికల గుర్తును ఉద్దేశించి) కవర్ చేసిందని వ్యాఖ్యానించారు.
ఆ కెమెరాల్లో మమ్మల్ని కూడా చూపించండి.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఖర్గే అభ్యర్థన!
ఖర్గే విమర్శలకు భాజపా(Bjp) నుంచి అదే స్థాయిలో కౌంటర్ వచ్చింది. కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని యూపీఏ హయాంలో పలు కుంభకోణాల గురించి ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ జీ2 పదాన్ని తిప్పికొట్టారు. ‘ఆయనకు 2జీ ఒకటే కనిపిస్తోంది. వన్‌జీ సన్‌జీ(One G and Son G)’ అని దుయ్యబట్టారు.
ఈ రోజు నుంచి పార్లమెంట్ ‘ప్రత్యేక’ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. పార్లమెంట్‌లో 75 ఏళ్ల కాలంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలను గుర్తుచేసుకున్నారు. అలాగే పాత భవనంతో ఉన్న అనుబంధంపై ఉద్విగ్నభరితులయ్యారు. ఈ ‘ప్రత్యేక’ సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలుంటాయని ప్రధాని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం