Shashi Tharoor: కాంగ్రెస్‌లో ఖర్గే మార్పులు తీసుకురాలేరు: శశి థరూర్‌

కాంగ్రెస్‌ పార్టీలో మల్లికార్జున్‌ ఖర్గే మార్పులు తీసుకురాలేరని పార్టీ అధ్యక్ష బరిలో నిలిచిన ఎంపీ శశి థరూర్‌ వ్యాఖ్యానించారు. తానైతే కార్యకర్తలు కోరుకునే విధంగా మార్పులు చేపడతానని పేర్కొన్నారు.

Published : 03 Oct 2022 01:25 IST

నాగ్‌పుర్‌: మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) లాంటి నేతలు కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు తీసుకురాలేరని కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో నిలిచిన ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) వ్యాఖ్యానించారు. ఆయన గెలిస్తే కాంగ్రెస్‌లో పాత పద్ధతులే కొనసాగుతాయన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో థరూర్‌ మాట్లాడుతూ.. తనను ఎన్నుకుంటే కార్యకర్తలు కోరుకునే విధంగా పార్టీలో మార్పులు తీసుకొస్తానని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. దిల్లీలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ‌(Congress) పార్టీని బలోపేతం చేసేందుకే తాను ఎన్నికల బరిలోకి దిగినట్లు పేర్కొన్నారు. ఎవరినో ఎదిరించడానికి కాదన్నారు. అనేకమంది సీనియర్లు, యువ నేతలు తనను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. ‘ఒకే వ్యక్తికి ఒకే పదవి’ సిద్ధాంతాన్ని అనుసరించి నామినేషన్‌ వేసిన రోజే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని