Telangana news: డిక్లరేషన్‌పై తెరాస, భాజపాలు ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి?: మల్లు రవి

వరంగల్‌లో కాంగ్రెస్ ప్రకటించిన వ్యవసాయ డిక్లరేషన్‌పై రైతులు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి

Published : 10 May 2022 02:09 IST

హైదరాబాద్‌: వరంగల్‌లో కాంగ్రెస్ ప్రకటించిన వ్యవసాయ డిక్లరేషన్‌పై రైతులు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిక్లరేషన్ అమలు చేస్తారనే నమ్మకం రైతుల్లో వచ్చిందన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. డిక్లరేషన్‌పై తెరాస, భాజపాలు ఎందుకు ఉలిక్కి పడుతున్నాయని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ వరంగల్‌ సభలో రైతులకు భరోసా కలిగిస్తే మంత్రి కేటీఆర్‌ ఎందుకు విమర్శిస్తున్నారని నిలదీశారు. రాహుల్‌ గాంధీపై తెరాస చేస్తున్న విమర్శలను రాష్ట్ర ప్రజలు హర్షించడం లేదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెరాసను గద్దె దింపడం ఖాయమని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. భాజపా, తెరాస.. రెండూ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రాహుల్‌ గాంధీపై తెరాస, భాజపా చిల్లర మాటలు మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఘటన తప్పదని మల్లు రవి హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని