Published : 05 Aug 2022 18:58 IST

Modi-Mamata: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Narendra Modi) పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయితోపాటు ఇతర సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరయ్యేందుకు గానూ గురువారం దిల్లీ చేరుకున్న మమతా బెనర్జీ.. నాలుగు రోజులపాటు రాజధానిలోనే పర్యటించననున్నారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోనూ మమతా భేటీ కానున్నారు. అయితే, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన మంత్రి పార్థా ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రితో ఆ రాష్ట్ర సీఎం దీదీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్‌ సమావేశం ఆగస్టు 7న జరగనుంది. ఇందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు దిల్లీ చేరుకున్న మమతా బెనర్జీ.. ఇదే సమయంలో విపక్షపార్టీల నేతలతోనూ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని