..అలాగే వంటగ్యాస్‌ ధరలూ తగ్గించండి: మేనకా గాంధీ

దేశంలో మండిపోతున్న పెట్రో ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి, సుల్తాన్‌పూర్‌ భాజపా ఎంపీ మేనకా......

Published : 07 Nov 2021 01:48 IST

సుల్తాన్‌పూర్‌: దేశంలో మండిపోతున్న పెట్రో ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి, సుల్తాన్‌పూర్‌ భాజపా ఎంపీ మేనకా గాంధీ స్వాగతించారు. అదే మాదిరిగా వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలనూ తగ్గించాలని ఆమె కేంద్రానికి విజ్ఞప్తి ఏశారు. యూపీలోని తన లోక్‌సభ నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన ఆమె సుల్తాన్‌పూర్‌లో మాట్లాడారు. పెట్రో ధరల్ని కేంద్రం తగ్గించింది.. అలాగే వంటగ్యాస్‌తో పాటు ఇతర వస్తువుల ధరలనూ తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు.  పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ వంటగ్యాస్‌ ధరల తగ్గింపుపై కూడానిర్ణయం తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. తాను ఎక్కడికి  వెళ్లినా సభ్యుల్ని చేర్పిస్తుంటానని గుర్తుచేశారు.  జిల్లా పంచాయతీ ఎన్నికల ఎన్నికల్లో మనమే గెలవాల్సిందన్నారు. గతంలో భాజపాకు లక్షలాది మంది పార్టీ సభ్యులు ఉండేవారు.. కానీ జిల్లా పరిషత్‌లో ఒక్క స్థానమూ రాలేదన్నారు. కేవలం భాజపా ఆఫీస్‌ బేరర్లు ఓటు వేసినా గెలిచేవాళ్లమనీ.. బూత్‌ ప్రెసిడెంట్, అతడి కుటుంబం, బంధువులు ఓటేసినా గెలిచేవాళ్లమంటూ పంచాయతీ ఎన్నికలను ఉద్దేశించి మేనకా గాంధీ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని