Telangana News: ఎంపీ కోమటిరెడ్డి పార్టీ లైన్‌లోనే ఉన్నారు: మాణిక్‌రావు ఠాక్రే

పనితీరు బాగాలేకుంటే పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వారిని మార్చాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే హెచ్చరించారు.

Published : 15 Feb 2023 19:06 IST

హైదరాబాద్‌: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని, పార్టీ లైన్‌లోనే ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే  తెలిపారు. రాహుల్‌గాంధీ మాటలకు కోమటిరెడ్డి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులంతా ఐక్యంగా ఉన్నారని, త్వరలోనే పాదయాత్ర చేస్తారని వెల్లడించారు. ఠాక్రే బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 34 మంది ఉపాధ్యక్షులు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం 9మంది మాత్రమే హాజరయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుల గైర్హాజరుపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు గైర్హాజరయ్యారో వివరణ అడగాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సూచించారు. ఎల్లుండి మరోసారి ఉపాధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటించి హాథ్‌ సే హథ్‌ జోడో యాత్రలో పాల్గొంటానని చెప్పారు. పనితీరు బాగాలేకుంటే పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వారిని మార్చాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొందరు ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఇంకోసారి మాట్లాడదామని సర్ది చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని