
Manik saha: వైద్యుడిగా మొదలై.. సీఎం దాకా.. త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా!
అగర్తల: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త్రిపుర సీఎంగా బిప్లవ్ దేబ్ రాజీనామాతో తదుపరి సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. బిప్లవ్ దేబ్ రాజీనామా చేయడం, కొత్త సీఎం ఎంపిక వంటి కీలక మార్పులు శనివారం చకచకా జరిగిపోయాయి. నూతన ముఖ్యమంత్రిగా భాజపా అధిష్ఠానం ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ డాక్టర్ మాణిక్ సాహాను ఎంపిక చేసింది. దీంతో త్రిపుర 11వ ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బిప్లవ్ దేబ్ మాణిక్ సాహాకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
వృత్తిరీత్యా దంత వైద్యుడైన మాణిక్ సాహా.. అంతకముందు కాంగ్రెస్‌లో పనిచేసి 2016లో భాజపాలో చేరారు. ప్రస్తుతం భాజపా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు హపానియాలోని త్రిపుర వైద్య కళాశాలలో బోధనలు కూడా చేశారు. త్రిపురలో 25ఏళ్ల వామపక్ష ప్రభుత్వ పాలనకు తెరదించుతూ భాజపా తొలిసారి 2018 మార్చిలో బిప్లబ్కుమార్ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలు పర్యవేక్షించడంలో వైఫల్యం చెందారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. దీనికితోడు, సొంత పార్టీ నుంచి కూడా అసమ్మతి సెగ తగలడంతో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భాజపా అధినాయకత్వం కీలక మార్పులు చేసినట్టు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో త్రిపురలో జరిగిన పురపాలక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడంలో మాణిక్ సాహా కీలక పాత్ర పోషించారు. భాజపా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు బిప్లబ్ కుమార్ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మాణిక్ సాహా గురించి క్లుప్తంగా..
మాణిక్ సాహా పశ్చిమ త్రిపురలో జనవరి 8, 1953లో జన్మించారు. ఆయనకు భార్య స్వప్న సాహా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పట్నాలోని ప్రభుత్వ వైద్య కశాశాలలో బీడీఎస్; లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ వైద్య కళాశాలలో ఎండీఎస్ పూర్తి చేశారు. పలు పత్రికలు, జర్నల్స్‌కు వ్యాసాలు కూడా రాస్తుంటారు. క్రీడలంటే ఎంతో మక్కువ. స్వయంగా ఆయన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన మాణిక్ సాహా పలు పతకాలు/ సర్టిఫికెట్లు సాధించారు. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, త్రిపుర స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శిగానూ వ్యవహరించారు. ఈజిప్టు, హాంకాంగ్, థాయిలాండ్, దుబాయి వంటి దేశాల్లో పర్యటించారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్‌లో శాశ్వత సభ్యుడిగా, ఇండియన్ డెంటల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (06-07-2022)
-
India News
IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
Crime News
Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
-
General News
Harsh Goenka: బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో గోయెంకా, శిందే.. అసలు విషయం ఏంటంటే..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- బడి మాయమైంది!
- Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
- రూ.19 వేల కోట్ల కోత
- IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!