చెప్పులు విప్పి ఇంట్లోకెళ్లడం మా సంస్కృతి.. రాహుల్‌ గాంధీకి మణిపూర్‌ సీఎం కౌంటర్‌

మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆ రాష్ట్రానికి చెందిన పలువురు భాజపా నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, ఇంట్లోకి వెళ్లేముందు వారితో బయటే బలవంతంగా చెప్పులు విప్పించి వారిని అవమానించారని కాంగ్రెస్‌ అగ్రనేత

Published : 04 Feb 2022 02:17 IST

ఇంఫాల్‌: మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆ రాష్ట్రానికి చెందిన పలువురు భాజపా నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, ఇంట్లోకి వెళ్లేముందు వారితో బయటే బలవంతంగా చెప్పులు విప్పించి వారిని అవమానించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తక్షణమే వారికి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాహుల్‌ లేవనెత్తిన అంశంపై మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరెన్‌ సింగ్‌ తాజాగా ట్విటర్‌లో స్పందించారు. చెప్పులు విప్పడం మణిపూర్‌ సంస్కృతి అని చెప్పారు.

‘‘ఒకరి ఇంటికి వెళ్లినప్పుడు గుమ్మంలో చెప్పులు విప్పి లోపలికి వెళ్లడం మణిపూర్‌లో ఏళ్లుగా ఉన్న సంస్కృతి. కొందరు పనిగట్టుకొని దాన్ని అవమానం పేరుతో ప్రచారం చేస్తున్నారు. మా సంప్రదాయాల్ని పట్టించుకోవట్లేదు. రాహుల్‌ గాంధీ!.. మీరు మణిపూర్‌ గురించి మాట్లాడే ముందు మా రాష్ట్ర సంస్కృతి గురించి తెలుసుకోండి’’అని సీఎం బిరెన్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. 

మరోవైపు దేశం రెండు భారతదేశాలుగా విడిపోయిందని, ఒకటి ధనవంతుల దేశంగా.. మరొకటి పేదల దేశంగా మారిందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. ‘‘నిజమే.. ఒక దేశంలో ప్రజలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. రేవ్‌ పార్టీలకు, విదేశీ యాత్రలకు వెళ్తున్నారు. మరో దేశంలో ప్రజలు నిరాడంబరంగా బతుకుతున్నారు. తోటి వారికి అండగా నిలుస్తున్నారు. భారతీయుడిలా ఆలోచిస్తూ.. భారతీయ సంప్రదాయాలను అనుసరిస్తున్నారు’’ అని పరోక్షంగా రాహుల్‌ గాంధీని, మోదీని పోల్చుతూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని