marri sasidhar reddy: అమిత్‌ షాతో మర్రి శశిధర్‌రెడ్డి భేటీ.. భాజపాలో చేరే అవకాశం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రిశశిధర్‌రెడ్డి పార్టీ మారుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది.

Updated : 18 Nov 2022 22:32 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ మారుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి ఆయన అమిత్‌ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిణామాలపై నేతలు అమిత్‌ షాతో చర్చించారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడి గురించి బండి సంజయ్‌.. అమిత్‌ షాకు వివరించారు. వెంటనే అమిత్‌ షా.. అర్వింద్‌తో ఫోన్‌లో మాట్లాడి దాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మర్రి శశిధర్‌రెడ్డి వారం రోజుల్లో భాజపాలో చేరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై మర్రి శశిధర్‌రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని