Delhi MCD Elections: దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో.. ట్రాన్స్‌జెండర్ విజయం
దిల్లీ (Delhi) మున్సిపల్ ఎన్నికల్లో (MCD Elections) ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించారు. సుల్తాన్‌పురి నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థి బాబీ గెలుపొందారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లోని మున్సిపల్ కార్పొరేషన్ (MCD Elections)లో తొలిసారి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి విజయం సాధించారు. బుధవారం వెలువడుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో సుల్తాన్‌పురి-ఎ వార్డు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్(Transgender) బాబీ కిన్నార్ గెలిచారు.
సామాజిక కార్యకర్త అయిన 38 ఏళ్ల బాబీ (Bobi Kinnar).. అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. 2017లో జరిగిన దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బాబీకి టికెట్ ఇచ్చింది. దిల్లీలో ఓ టాన్స్‌జెండర్ అభ్యర్థికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం ఇదే తొలిసారి.
కాగా.. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో ఆప్ 134 స్థానాల్లో గెలుపొందింది. ఇక భాజపా 104 చోట్ల విజయం సాధించగా.. కాంగ్రెస్ 9 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
Sports News
IPL 2023: ‘ఈ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచేది ఆ జట్టే’.. ముంబయి, చెన్నైలకు నో ఛాన్స్!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?
-
Politics News
Congress: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ ట్వీట్లకు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!