Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక... గెలుపు ముంగిట వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైకాపా తరఫున ఉప ఎన్నిక బరిలో నిలిచిన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌

Updated : 26 Jun 2022 11:25 IST

ఆత్మకూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైకాపా తరఫున ఉప ఎన్నిక బరిలో నిలిచిన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 1,37,081 ఓట్లు పోలు కాగా.. ఇప్పటికే సగానికిపైగా ఓట్లు విక్రమ్‌ రెడ్డి సాధించడంతో ఆయన విజయం ఖాయమైంది. ఇక రౌండు రౌండుకూ ఆయన ఆధిక్యం పెరుగుతూ పోతోంది. 14 రౌండ్లు ముగిసి సరికే ఆయనకు 71 వేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. 15 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయన తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థిపై 61 వేలకుపైగా ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 2.13 లక్షల మంది ఓటర్లు ఉండగా, 1.37 లక్షల మంది ఉప ఎన్నిక పోలింగ్‌లో ఓట్లు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు