Published : 26 Feb 2021 01:24 IST

భాజపాలో చేరిన ‘మెట్రోమ్యాన్‌’

తిరువనంతపురం: మెట్రోమ్యాన్‌గా పేరుగాంచిన ఈ. శ్రీధరన్‌ భాజపాలో చేరారు. ఇటీవల తాను కాషాయ దళంలో చేరనున్నట్టు ప్రకటించిన ఆయన గురువారం రాత్రి మలప్పురంలో అధికారికంగా భాజపాలో చేరారు. కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ 88 ఏళ్ల మెట్రో మ్యాన్‌ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. కమలం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సీఎం పదవి చేపట్టేందుకు తాను సిద్ధమేనన్నారు. భాజపా కోరితే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని, అయితే, తన ప్రధాన లక్ష్యం కేరళలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమేనంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దేశంలో అనేక మెట్రో రైలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో శ్రీధరన్‌ కీలక పాత్ర పోషించారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని