దొంగ ఓట్లు ఉన్నాయని భాజపా తప్పుడు ప్రచారం:ఒవైసీ

హైదరాబాద్‌లో దొంగ ఓట్లు ఉన్నాయని భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. దొంగ ఓట్లపై ఆ పార్టీ

Updated : 24 Nov 2020 06:33 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో దొంగ ఓట్లు ఉన్నాయని భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. దొంగ ఓట్లపై ఆ పార్టీ విచారణ జరిపించాలన్నారు. మజ్లిస్‌ పార్టీపై భాజపా నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చాదర్‌ఘాట్‌ అజాంపురలో ఎంఐఎం బహిరంగసభ నిర్వహించింది. ఈ సభకు ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాలన్నింటిలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పోరాటంలో మజ్లిస్‌ ముందుంటుందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని