Ambati Rambabu: పోలవరం డయాఫ్రం వాల్‌పై చర్చకు సిద్ధమా?: చంద్రబాబుకు అంబటి సవాల్‌

పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన డయా ఫ్రం వాల్‌ ఎవరి చర్య వల్ల దెబ్బతిందో చర్చ జరగాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Updated : 01 Jun 2022 15:04 IST

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్‌ ఎవరి చర్య వల్ల దెబ్బతిందో చర్చ జరగాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దీనిపై చర్చకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమలకు ఆయన సవాల్‌ విసిరారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరి డెల్టాకు సాగునీటిని మంత్రి ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం డయా ఫ్రం వాల్‌పై పలు అంశాలను ప్రస్తావించారు. 

‘‘ఇంజినీర్లు, మేధావులు, మీడియాతో డయాఫ్రం వాల్‌పై చర్చ జరగాలి. కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టడం వల్లే వరదలకు దెబ్బతింది. కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టడం చారిత్రక తప్పిదం. డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది నిర్మించాలా? అన్న అంశంపై దేశంలో ఉన్న మేధావులు తలలు పట్టుకుంటున్నారు. ఏ ప్రాజెక్టు అయినా దశల వారీగానే పూర్తవుతుంది. మొదటి దశ పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. ప్రాజెక్ట్ పూర్తికి గడువు లేదు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. అనుకున్న విధంగానే జూన్‌ 1న గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేశామన్నారు. నీటి విడుదలతో నారుమళ్లు వేసుకోవడానికి రైతులకు వీలుగా ఉంటుందని అంబటి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీలు భరత్‌, గీత తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని