Andhra News: నా దగ్గర పత్రికను బట్టి సమాధానం ఉంటుంది.. విలేకరిపై రుసరుసలాడిన అంబటి

పోలవరం ప్రాజెక్టుపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చిందులు తొక్కారు. పోలవరం ప్రాజెక్టుపై పలు కీలక  ప్రశ్నలు అడగడంతో

Updated : 23 Apr 2022 21:14 IST

విజయవాడ: పోలవరం ప్రాజెక్టుపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చిందులు తొక్కారు. పోలవరం ప్రాజెక్టుపై పలు కీలక  ప్రశ్నలు అడగడంతో సమాధానం ఇవ్వకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో గతంలో చేసిన పనుల్లో లోపాల వల్లే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయిందని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో నిర్మించిన పనులకు పీపీఏ, సీడబ్ల్యూసీ అనుమతి ఉందా.. లేదా అని మీడియా ప్రతినిధులు సూటి ప్రశ్న వేశారు. ప్రాజెక్టుకు పీపీఏ, సీడబ్ల్యూసీ అనుమతిపై తొలుత దాటవేత ధోరణిలో మంత్రి సమాధానం ఇచ్చారు.

అనుమతి ఉందా లేదా అనే విషయమై సూటిగా సమాధానం చెప్పాలని ప్రశ్నించిన ఈనాడు విలేకరిపై నోరు పారేసుకున్నారు. పత్రికను బట్టి సమాధానం ఉంటుందని గద్దించారు. ప్రెస్‌మీట్‌ పెట్టిన అంశంపై నిజాయతీగా అధ్యయనం చేయకుండా, విషయం లోతులు తెలుసుకోకుండా అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక నీటిపారుదల మంత్రి నీళ్లు నమిలారు. విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు పళ్లు కొరుకుతూ విపరీత హావభావాలు ప్రదర్శిస్తూ వ్యంగం, వెటకారం కలగలిపి విలేకరిపై ఎదురుదాడికి దిగారు. ‘‘పీపీఏ, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టించాలనుకుంటున్నారా? మీరు తిట్టించాలని ప్రయత్నించినా నేను వారిని తిట్టను. వాదన వద్దు.. విను.. నా వద్ద పత్రికను బట్టి సమాధానం ఉంటుంది. నేను చెప్పేది చెబుతాను. మీకు ఇష్టమొచ్చింది రాసుకోండి’’ అని అంబటి తేల్చి చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని