Andhra News: మంత్రి పదవి ఉన్నా.. లేకపోయినా బాధపడను: మంత్రి అప్పలరాజు
మంత్రి పదవి ఉన్నా లేకపోయినా బాధపడనని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మంత్రి పదవి కన్నా తనకు ప్రజాసేవే ముఖ్యమని స్పష్టం చేశారు.
అమరావతి: మంత్రి పదవి ఉన్నా లేకపోయినా బాధపడనని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మంత్రి పదవి కన్నా తనకు ప్రజాసేవే ముఖ్యమని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం సీఎం జగన్‌తో మంత్రి అప్పలరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా దృష్టిలో వైకాపా ఎమ్మెల్యేలందరూ మంత్రులే. బీసీల నుంచి వచ్చిన నాకు జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న సమాచారం లేదు’’ అని అప్పలరాజు వివరించారు.
ఏపీ కేబినెట్‌లో మార్పులు జరగబోతున్నాయంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. నలుగురు మంత్రులను తప్పించి.. కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి అప్పలరాజు సీఎం జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
APPSC: త్వరలో గ్రూప్ -1, గ్రూప్-2 నోటిఫికేషన్లు: గౌతమ్ సవాంగ్
-
Movies News
Aamir Khan: ప్రస్తుతానికి సినిమాలు చేయాలని లేదు.. ఎందుకంటే: ఆమిర్ ఖాన్
-
Sports News
IPL 2023: యువకులు కాదు.. యమడేంజర్లు!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Dhruv Chopper Fleet: ధ్రువ్ హెలికాప్టర్లకు క్లియరెన్స్ పునరుద్ధరించిన సైన్యం
-
General News
CM KCR: విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్