సంతబొమ్మాళి ఘటనలో కుట్రకోణం: సీదిరి

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో మంచిపేరు రాకూడదనే పథకాలు ప్రారంభించే ముందు ఉద్దేశపూర్వకంగా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో నంది విగ్రహం..

Published : 21 Jan 2021 02:23 IST

అమరావతి: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో మంచిపేరు రాకూడదనే పథకాలు ప్రారంభించే ముందు ఉద్దేశపూర్వకంగా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో నంది విగ్రహం తొలగించిన ఘటనలో తెదేపా ప్రమేయం ఉందన్నారు. ఇంటివద్దకే నిత్యావసరాల కార్యక్రమాన్ని రేపు సీఎం జగన్‌ ప్రారంభిస్తు్న్నారని.. దీన్ని పక్కదారి పట్టించేందుకు విగ్రహాల ధ్వంసం కార్యక్రమానికి ప్రణాళిక వేశారని ఆక్షేపించారు. 

సంతబొమ్మాళి ఘటనలో సుస్పష్టంగా కుట్రకోణం ఉందని.. తెదేపా కనుసన్నల్లోనే విగ్రహాల ధ్వంసం కార్యక్రమం జరుగుతోందని అప్పలరాజు ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి పనులు ఎవరు చేసినా వారిని ప్రజలు రాజకీయంగా సమాధి చేస్తారన్నారు. సంతబొమ్మాళి ఘటనపై ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి..

నల్లపురెడ్డి మాటలు వినిపించలేదా?: జేసీ

‘వాల్తేర్‌ క్లబ్‌ వివాదంలో సిట్‌ జోక్యం వద్దు’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు