ప్రభుత్వంలో చర్చించాక మాట్లాడతాం: బొత్స 

విశాఖ ఉక్కు కర్మాగారం ఇక్కడ ప్రజల మనోభావాలతో కూడుకున్నదని.. దీనిపై ప్రభుత్వంలో చర్చించాక తమ నిర్ణయం వెల్లడిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ..

Published : 06 Feb 2021 01:52 IST

విశాఖ ఉక్కు..మనోభావాలతో కూడుకున్నదన్న మంత్రి

విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారం ఇక్కడ ప్రజల మనోభావాలతో కూడుకున్నదని.. దీనిపై ప్రభుత్వంలో చర్చించాక తమ నిర్ణయం వెల్లడిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘విశాఖ ఉక్కు పరిశ్రమకు కొంత నష్టాలొచ్చాయి. సుమారు రూ.25వేల నుంచి రూ.30వేల కోట్ల వరకు నష్టముంది. దాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం వారికున్న పారిశ్రామిక విధానాన్ని తీసుకోవడం జరిగింది. ఏదేమైనా ఇది ప్రజల సెంటిమెంట్‌తో కూడుకున్న అంశం కాబట్టి ఏవిధంగా ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేసేందుకు అవకాశాలు ఉన్నాయనే దానిపై ప్రభుత్వంలో చర్చించాక మాట్లాడతాం’’ అని బొత్స చెప్పారు.

ఇవీ చదవండి..

ప్రైవేటీకరణ నిర్ణయం ఒక్కరోజుది కాదు: సుజనా అలాంటి అధికారులకు బ్లాక్‌లిస్టే: మంత్రి పెద్దిరెడ్డి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని