నూటికి నూరుశాతం విజయం మాదే: బొత్స

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గ్రామాల్లో ఏకగ్రీవాలు ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నాయని

Published : 26 Jan 2021 01:43 IST

అమరావతి: పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గ్రామాల్లో ఏకగ్రీవాలు ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నాయని చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం తమదే విజయమని బొత్స ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ఇబ్బంది రాకూడదనేదే తమ అభిప్రాయమన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఎన్నికలంటే భయం లేదని.. ఎవరో వచ్చి తమ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. ఎవరేం చేసినా అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలని చెప్పారు.

ప్రలోభాలకు గురిచేసేవారిపై కఠిన చర్యలు: పెద్దిరెడ్డి

గత ఎన్నికల్లోని అనుభవాల దృష్ట్యా మద్యం, ధన ప్రవాహంతో ప్రలోభాలకు గురిచేసేవారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు చేశామన్నారు. అక్రమాలకు పాల్పడేవారిపై ఎన్నికల తర్వాత కూడా చర్యలు తీసుకునేలా చట్టంలో సవరణలు చేశామని.. అలాంటి వారిపై అనర్హత వేటుతో పాటు రెండేళ్ల జైలు శిక్ష తప్పదన్నారు.  

ప్రజారోగ్యంతో నిమ్మగడ్డ చెలగాటం: కన్నబాబు

వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. ఓ పార్టీ చేసిన కుట్రకు నిదర్శనమే ఈ పరిస్థితి అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని..కోర్టు ఇచ్చిన తీర్పు శిరోధార్యమేనని చెప్పారు. 

ఇవీ చదవండి..

సుప్రీం తీర్పు: ఎస్‌ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం

ఎన్నికలను రీషెడ్యూల్‌ చేసిన ఎస్‌ఈసీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని