Rushikonda: పవన్‌ రాద్ధాంతం వల్ల గోరంత ఉపయోగం ఉండదు: మంత్రి బొత్స

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రుషికొండను పరిశీలించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్‌ రాద్ధాంతం వల్ల గోరంతం ఉపయోగం కూడా ఉండదని విమర్శించారు.

Published : 13 Nov 2022 01:38 IST

విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రుషికొండను పరిశీలించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ రాద్ధాంతం చేయడం వల్ల గోరంత కూడా ఉపయోగం ఉండదన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నాం.. తప్పేంటి? ఇక్కడ గతంలో కూడా భవనాలు ఉన్నాయి. విజయనగరం గుంకలాం వద్ద రాష్ట్రంలోనే అతిపెద్ద టౌన్‌షిప్‌ నిర్మిస్తున్నాం. గుంకలాంలో జగనన్న కాలనీ పూర్తి చేయడానికి నాలుగేళ్లు పడుతుంది’’ అని బొత్స తెలిపారు. 

గుంకలాం వస్తానన్న పవన్‌ను ఆహ్వానిస్తున్నాం: కొలగట్ల 

విజయనగరం జిల్లా గుంకలాం జగనన్న కాలనీ సందర్శనకు వస్తానన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానిస్తున్నామని డిప్యూటీ స్పీకర్‌ కొలగట్ల వీరభద్రస్వామి తెలిపారు.‘‘ రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్‌ గుంకలాం జగనన్న కాలనీ. 12వేల మందికి పైగా లబ్ధిదారులకు లే అవుట్‌ వేశాం. ఇళ్లు కట్టడం లేదని  పవన్‌కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు.రూ.5లక్షల విలువైన స్థలం, ఇంటికి రూ.లక్షన్నర ఇస్తున్నాం. లబ్ధిదారులకు ఇసుక, సిమెంట్‌, ఇనుము అందుబాటులో ఉంచాం. కాలనీలో 108 బోర్లు వేశాం, కరెంట్‌ ఇచ్చాం, రోడ్లు వే స్తున్నాం. గుంకలాంలో 8వేల మందికి ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తోంది. 2వేల మంది తామే ఇళ్లు కట్టుకుంటామన్నారు. గుంకలాం కాలనీకి వస్తానన్న పవన్‌ను ఆహ్వానిస్తున్నాం’’ అని వీరభద్రస్వామి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని