Telangana News: సైనిక్‌ స్కూల్‌, కోచ్‌ ఫ్యాక్టరీలపై అమిత్‌షావి పచ్చి అబద్ధాలు: ఎర్రబెల్లి

తుక్కుగూడలో సభా వేదికగా కేంద్ర మంత్రి అమిత్‌షా అబద్ధాలు మాట్లాడారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు.

Updated : 15 May 2022 12:47 IST

హైదరాబాద్‌: తుక్కుగూడలో సభా వేదికగా కేంద్ర మంత్రి అమిత్‌షా అబద్ధాలు మాట్లాడారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఎన్నికల హామీల్లో తెరాస 95 శాతం నెరవేర్చిందన్న ఆయన.. భాజపా కనీసం ఒక్కటైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచి పేదల నడ్డి విరిచారని విమర్శించారు. హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్‌ సైనిక్‌ స్కూల్‌, కోచ్‌ ఫ్యాక్టరీ, వైద్యకళాశాలలపై అమిత్‌షా వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని ఎర్రబెల్లి కొట్టిపారేశారు. భాజపా బోగస్‌ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని వ్యాఖ్యానించారు.

సైనిక్‌ స్కూల్‌, కోచ్‌ ఫ్యాక్టరీలకు భూమి ఇచ్చినా ఇవ్వలేదని అబద్ధాలు చెప్పారని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని పంచాయతీలకు ఇంకా రూ.1000కోట్లు రావాలని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో రూ.25వేల కోట్లు కోత పెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌ తెలంగాణ గాంధీ అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని