Gangula kamalakar: భాజపా తీరు మారకపోతే తీవ్ర పరిణామాలుంటాయి: మంత్రి గంగుల

భాజపా నేతల తీరు మారకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్  హెచ్చరించారు.

Updated : 19 Mar 2022 16:33 IST

సిరిసిల్ల: భాజపా నేతల తీరు మారకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్  హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు.. తెరాస, భాజపా నాయకుల మధ్య ఘర్షణకు దారితీశాయి. దీంతో మంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఇలాంటివి పునరావృతమైతే భాజపా నేతల ఉనికి లేకుండా చేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. మంచితనాన్ని కమలం నేతలు అలుసుగా తీసుకోవద్దన్న గంగుల.. తాజా ఘటనపై బండిసంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని