Fuel Price: బారానా పెంచి చారానా తగ్గించారు: మంత్రి హరీశ్‌రావు

కేంద్ర ప్రభుత్వం చమురుపై సెస్‌ను బారానా పెంచి చారానా తగ్గించిందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. భాజపా సర్కార్‌కు నిజాయితీ ఉంటే 2014లో పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ ఎంత ఉందో అంతకు తగ్గించాలన్నారు.

Updated : 22 May 2022 17:04 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం చమురుపై సెస్‌ను బారానా పెంచి చారానా తగ్గించిందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. భాజపా సర్కార్‌కు నిజాయితీ ఉంటే 2014లో పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ ఎంత ఉందో అంతకు తగ్గించాలన్నారు. హైదరాబాద్‌లో హరీశ్‌ మీడియాతో మాట్లాడారు.

చమురుపై సెస్‌ తగ్గించామని కేంద్రం చేస్తున్న ప్రచారమంతా బోగస్‌ అని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సెస్‌ తగ్గించాలంటూ భాజపా నేతలు చేస్తున్న డిమాండ్లపై హరీశ్‌ స్పందించారు. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సెస్‌ పెంచితే కదా తగ్గించడానికి అని ఆయన వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని