TRS vs BJP: అన్ని పథకాలకు కేంద్రమే నిధులిస్తుందనడం హాస్యాస్పదం: హరీశ్‌రావు

అమిత్‌ షా.. అబద్ధాల షా అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. అన్ని పథకాలకు కేంద్రం ప్రభుత్వం నిధులు ఇస్తుందనడం హాస్యాస్పదమన్నారు.

Updated : 15 May 2022 15:10 IST

హైదరాబాద్‌: అమిత్‌ షా.. అబద్ధాల షా అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. అన్ని పథకాలకు కేంద్రం ప్రభుత్వం నిధులు ఇస్తుందనడం హాస్యాస్పదమన్నారు. నిధులు ఎక్కడ ఇచ్చారో చూపించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరూ పొంతన లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంతో రాష్ట్రం సస్యశ్యామలమైందని గడ్కరీ చెబితే.. లాభం లేదని అమిత్‌షా చెప్పడం ఆంత్యరమేంటని ప్రశ్నించారు.

భాజపా నేతల అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారన్న ఆయన.. వారికి సరైన సమయంలో బుద్ధి చెబుతారని విమర్శించారు. ఆర్టికల్‌- 370కి తెరాస మద్దతు ఇచ్చిందన్న హరీశ్‌.. మజ్లిస్‌కు భయపడి ఇవ్వలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తున్నామని వెల్లడించారు. పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రమంత్రి అమలు చేస్తున్నట్లు చెప్పారన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు