Harish Rao: కాంగ్రెస్ గెలిస్తే.. ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి: హరీశ్‌రావు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్నెళ్లకో ముఖ్యమంత్రి వస్తారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
నారాయణ్‌ఖేడ్: తెలంగాణలో అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ హామీలిచ్చిన కాంగ్రెస్.. తాము అధికారంలో ఉన్న కర్ణాటకలో వాటిని ఎందుకు అమలు చేయడం లేదని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కర్ణాటకలో ఆస్పత్రులు బాగా లేవని సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణకు వచ్చి చికిత్స చేసుకుంటున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ గెలిస్తే ఆర్నెళ్లకో ముఖ్యమంత్రి మారతాడని అన్నారు. ఆ పార్టీ నేతలు మంచినీళ్లు తాగాలన్నా దిల్లీకి పరుగెత్తుతారని విమర్శించారు. కాంగ్రెస్, భాజపా నేతలకు బాస్‌లు దిల్లీలో ఉన్నారని ఎద్దేవా చేశారు.మరోవైపు అవకాశం వచ్చిన ప్రతిసారీ, ప్రధాని మోదీ తెలంగాణపై విషం చిమ్ముతున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు. ‘‘ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకోలేదని మోదీ అవమానించారు. తెలంగాణ ఏర్పడగానే మోదీ ఈ రాష్ట్రానికి మోసం చేశారు. రాత్రికి రాత్రే తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలిపింది మోదీ కాదా?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
జీతం లేకుండా పనిచేస్తానన్న సీఈఓ.. కారణం ఇదే..!
-
EPFO: అధిక పింఛను వివరాల అప్‌లోడ్‌కు మరింత గడువు
-
Congress: బీసీలకు టికెట్ల కేటాయింపుపై కేసీ వేణుగోపాల్‌తో కాంగ్రెస్ నేతల భేటీ
-
Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
Postal Jobs: పోస్టల్లో 30,041 ఉద్యోగాలు.. రెండో షార్ట్‌లిస్ట్ ఇదిగో!