TS News: విప‌క్షాల వ్యాఖ్య‌లు విడ్డూరం: హ‌రీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో నిరుప‌యోగంగా ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను సర్కారు విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో.. విప‌క్షాల వ్యాఖ్య‌లు విడ్డూరంగా ఉన్నాయ‌ని ఆర్థిక‌ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వ‌ర, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోతల

Published : 14 Jun 2021 14:56 IST

లింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్రంలో నిరుప‌యోగంగా ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను సర్కారు విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో.. విప‌క్షాల వ్యాఖ్య‌లు విడ్డూరంగా ఉన్నాయ‌ని ఆర్థిక‌ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వ‌ర, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోతల ప్రాజెక్టు స‌ర్వే ప‌నుల‌ను ప్రారంభించిన అనంతరం ఆయ‌న మాట్లాడారు. ఎత్తిపోత‌ల ప్రాజెక్టుతో ఈ ప్రాంత‌మంతా స‌స్య‌శ్యామ‌లం అవుతుంద‌ని.. 60, 70 రోజుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ త‌యారు చేయాల‌ని అధికారుల‌ను కోరుతున్నాన‌న్నారు. రూ.16 కోట్లతో సంగ‌మేశ్వ‌ర‌, రూ.11 కోట్ల‌తో బ‌స‌వేశ్వ‌ర స‌ర్వే ప‌నులు చేపడుతున్నామన్నారు.

భూముల‌మ్మితే అధికారంలోకి వ‌చ్చాక మ‌ళ్లీ తీసుకుంటామ‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అంటున్నార‌ని.. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ స‌ర్కారు 88,500 ఎక‌రాలు అమ్మింద‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. గురివింద గింజ త‌ర‌హాలో భ‌ట్టి ఆరోప‌ణ‌లున్నాయ‌న్నారు. భూముల విక్ర‌యం అత్యంత పార‌దర్శ‌కంగా జ‌రుగుతోంద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. భూములు అమ్మితే వ‌చ్చిన ఆదాయంతో పేద‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందుతాయ‌ని.. ఇలా కాకూడ‌ద‌ని ప్ర‌తిప‌క్షాలు భావిస్తున్నాయా ? అని ప్ర‌శ్నించారు. ఉచిత విద్యుత్ కోసం ప్ర‌భుత్వం నెల‌కు రూ.900 కోట్లు ఖ‌ర్చు పెడుతోంద‌న్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మితే ప్రోత్సాహ‌కాలు ఇస్తామ‌ని కేంద్రం లేఖ రాసింద‌ని హ‌రీశ్‌రావు అన్నారు. మీరు అమ్మిన దాంట్లో 40 శాతం మీకే ఇస్తామ‌ని పోటి పెట్టింద‌ని ఆయ‌న చెప్పారు. కేంద్రం బీహెచ్ఈఎల్‌, ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ భూములు అమ్మ‌కానికి పెట్టింద‌న్నారు. ప్ర‌భుత్వ సంస్థ‌ల నుంచి పెట్టుబ‌డుల‌ను కేంద్రం ఉప‌ సంహ‌రించుకుంటోంద‌ని అన్నారు. పెట్టుబ‌డుల ద్వారా బ‌ల‌హీన వ‌ర్గాలు రిజ‌ర్వేష‌న్లు కోల్పోతాయ‌ని చెప్పారు. కేంద్రం త‌ర‌హాలో రాష్ట్రం ప‌న్నులు పెంచ‌లేద‌న్నారు. ఏడాదిలో 43 సార్లు పెట్రోలు ధ‌ర‌లు పెంచింద‌ని ఆయ‌న ఆక్షేపించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని