Kishan reddy: మా వ్యూహం ఎన్నికల సమయంలో చూపిస్తాం: కిషన్‌రెడ్డి

మోదీ నాయకత్వమే తెలంగాణలో భాజపాను గెలిపిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated : 27 May 2023 19:25 IST

హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అధ్యక్షుడి మార్పుపై అనవసర చర్చలు వద్దని భాజపా శ్రేణులకు హితవు పలికారు. క్రమశిక్షణ తప్పి మాట్లాడకూడదని నేతలు, క్యాడర్ గ్రహించాలని సూచించారు. భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారాస ప్రభుత్వం, కేసీఆర్‌పైన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఫేస్ అవుట్ డేట్ అయిందని విమర్శించారు. మోదీ ఫేస్‌ తెలంగాణలో భాజపాను గెలిపిస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ వ్యూహం ఏంటో ఎన్నికల సమయంలో చూపిస్తామని చెప్పారు. ఒక్క రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడించే సత్తా, సమర్థత భాజపాకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కేంద్రం తరఫున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని