Koppula Eshwar: మంత్రి కొప్పులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Published : 18 Aug 2022 02:06 IST

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. 2018లో ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని మంత్రి కొప్పుల మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు మంత్రి పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్‌ను సవాల్ చేస్తూ  కొప్పుల ఈశ్వర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు మంత్రి కొప్పుల పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని