KTR: మరోసారి అవకాశం ఇవ్వమని అడుగుతుంటారు.. వాళ్లను నమ్మొద్దు: కేటీఆర్‌

సాగు, తాగునీరులో దేశానికి ఆదర్శంగా నిలిచామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆరేడు దశాబ్దాలు ఉండి వాళ్లేమి చేయలేదని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో సుంకిశాల ఇన్‌టేక్‌వెల్‌కు భూమిపూజ చేసిన అనంతరం కేటీఆర్‌ హాలియాలో పర్యటించారు.

Updated : 14 May 2022 14:45 IST

హాలియా: సాగు, తాగునీరులో దేశానికి ఆదర్శంగా నిలిచామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆరేడు దశాబ్దాలుగా అధికారంలో ఉండి ఏమీ చేయలేదని పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆరోపించారు. నల్గొండ జిల్లాలో సుంకిశాల ఇన్‌టేక్‌వెల్‌కు భూమిపూజ చేసిన అనంతరం కేటీఆర్‌ హాలియాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

‘‘రూ.46వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్‌ భగీరథ తీసుకొచ్చాం. పేదలకు అండగా ఉన్నాం కాబట్టే పింఛన్‌ను పది రెట్లు పెంచాం. ఆరోగ్యలక్ష్మి ద్వారా తల్లీబిడ్డకు పౌష్ఠికాహారం అందిస్తున్నాం. సన్నబియ్యంతో పౌష్ఠికాహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో వెయ్యికి పైగా విద్యాసంస్థలు ప్రారంభించాం. విదేశీ విద్య కోసం రూ.20లక్షలు ఇస్తున్నాం. రైతులకు 24గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే సాధించుకున్నాం. రైతులకు ఏదో చేస్తామని.. మరోసారి అవకాశం ఇవ్వాలని కొంతమంది అడుగుతుంటారు వాళ్లను నమ్మొద్దు’’ అని కేటీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని