KTR: కేసీఆర్‌ లేకపోతే టీపీసీసీ ఎక్కడిది.. టీభాజపా ఎక్కడిది?: కేటీఆర్‌

విమర్శలు చేయడమే కాంగ్రెస్‌ పనిగా పెట్టుకుందని మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ

Published : 07 May 2022 13:53 IST

గీసుకొండ: విమర్శలు చేయడమే కాంగ్రెస్‌ పనిగా పెట్టుకుందని మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చాలా మాట్లాడారని గుర్తు చేశారు. భాజపా పాలిత ప్రాంతాల్లో రైతు బీమా ఉందా అని ప్రశ్నించారు. సిలిండర్‌ ధర రూ.400 నుంచి రూ.1,050కి పెరిగిందని కేటీఆర్‌ మండిపడ్డారు. సిలిండర్‌ ధరపై మాత్రం భాజపా నేతలు మాట్లాడరని ధ్వజమెత్తారు. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా హవేలీలో కైటెక్స్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు భూమిపూజ, మిషన్‌ భగీరథ ట్యాంక్‌ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గణేశ్‌ ఎకో పెట్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌తో కలసి కేటీఆర్‌ మాట్లాడారు.

‘‘రాజకీయ పర్యాటకులు వస్తారు.. పోతారు. హైదరాబాద్‌లో బిర్యానీ తింటారు. వారు తెలిసి తెలియకుండా ఏవేవో మాట్లాడతారు. కేసీఆర్‌ లేకపోతే టీపీసీసీ ఎక్కడిది.. టీభాజపా ఎక్కడిది? విపక్షాల గురించి పట్టించుకోనక్కర్లేదు. చేసింది చెబుతాం.. చేసేది చెబుతాం.. మరోసారి కేసీఆర్‌ను సీఎం చేద్దాం.

పత్తి రైతులు బాగు పడాలనే సీఎం మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ నెలకొల్పారు. గుజరాత్‌, తమిళనాడు కంటే నాణ్యమైన పత్తి ఇక్కడ పండుతుంది. రాబోయే కాలంలో మరిన్ని కంపెనీలు ఇక్కడికి వస్తాయి. కరోనా వల్ల ఇక్కడికి కంపెనీలు రావడం ఆలస్యమయ్యాయి’’ అని కేటీఆర్‌ అన్నారు.

180 ఎకరాల్లో కైటెక్స్‌ టెక్స్‌టైల్‌ వస్త్ర పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మెగా జౌలి పార్కుకు రూ.100కోట్లతో చలివాగు నుంచి నీటి వసతి కల్పించనున్నారు. మరోవైపు 50ఎకరాల్లో ఏర్పాటు చేసిన గణేశ్‌ ఎకో పెట్‌ టెక్స్‌టైల్‌ పరిశ్రమలో 700మందికి ఉపాధి లభించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని