KTR: కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. తెలంగాణపై ప్రభావం చూపవు: కేటీఆర్‌

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీకి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు...

Updated : 13 May 2023 15:50 IST

హైదరాబాద్‌: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీకి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

కాంగ్రెస్‌ విజయంపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘ ‘ది కేరళ స్టోరీ’.. కర్ణాటక ఓటర్లపై ప్రభావం చూపించడంలో పూర్తిగా విఫలమైంది. అదే మాదిరిగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోయేది లేదు. నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటక ప్రజలకు నా కృతజ్ఞతలు. పెట్టుబడులు ఆకర్షించడం, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో హైదరాబాద్‌, బెంగళూరు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అది దేశానికి మంచి చేసేలా ఉండాలి. కర్ణాటక కొత్త ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు’’ అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని