KTR: తెలంగాణ పట్ల పక్షపాతం ఇంకెన్ని రోజులు?: మంత్రి కేటీఆర్‌

సింగరేణిలో నాలుగు బొగ్గు గనులు వేలం వేస్తున్నట్లు లోక్‌సభలో కేంద్రం ప్రకటించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక సింగరేణిపై కుట్రలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Updated : 24 Mar 2023 15:36 IST

హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రకటనపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీ కల్లొబొల్లి మాటలు చెప్పారని ధ్వజమెత్తారు. ‘‘నాలుగు బొగ్గు గనులు వేలం వేస్తున్నట్లు లోక్‌సభలో కేంద్రం ప్రకటించింది. సింగరేణిని ప్రైవేటీకరించడమంటే రాష్ట్రాన్ని కుప్పకూల్చడమే. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక సింగరేణిపై కుట్రలు చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తరహాలో గనులు కేటాయించకుండా కేంద్రం కుట్ర చేస్తోంది. లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏముంది? బొగ్గు గనులు కేటాయించాలన్న అభ్యర్థనను పట్టించుకోలేదు. గుజరాత్‌కు మాత్రం గనులు కేటాయించుకున్నారు. గుజరాత్‌కు ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా? అనేది ప్రధాని చెప్పాలి. తెలంగాణ పట్ల పక్షపాతం ఇంకెన్ని రోజులు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని