Published : 15 May 2022 01:46 IST

మరో టూరిస్టు వచ్చారు.. తిన్నారు.. వెళ్లారు: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటనపై తెరాస కార్వనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘తెలంగాణలో పొలిటికల్‌ టూరిజం సీజన్‌ కొనసాగుతోంది. ఈ రోజు మరో టూరిస్టు వచ్చారు, తిన్నారు, వెళ్లారు.  8 ఏళ్లలో తెలంగాణకు భాజపా ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. భాజపా అంటే బక్వాస్‌ జుమ్లా పార్టీ’ అని కేటీఆర్‌ విమర్శించారు. 

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు.  తెరాస ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలోని అవినీతి సర్కార్‌ను గద్దె దించేందుకు యువత కదిలి రావాలని అమిత్‌షా పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని