KTR: పెట్రో ధరలపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్‌

భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇంధనాలపై అధిక వ్యాట్‌ వసూలు చేస్తున్నారని కేంద్రం చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్రం సెస్‌ను తొలగిస్తే.. పెట్రోల్‌ రూ.70కి, డీజిల్‌ రూ.60కే అందిస్తామన్నారు.

Published : 15 Dec 2022 23:05 IST

హైదరాబాద్‌: తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలు ఇంధనాలపై అధిక వ్యాట్‌ (VAT) వసూలు చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరీ(Hardeep Singh Puri) వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్‌ వేదికగా ఖండించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజలపై పెట్రో ఎక్కువగా పడుతుందని లోక్‌సభలో కేంద్ర మంత్రి పేర్కొనడాన్ని కేటీఆర్‌ విమర్శించారు. 

కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఇంధన ధరలు పెరిగాయని ఆరోపించిన కేటీఆర్‌.. 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ పెంచలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తొలగిస్తే పెట్రోల్‌ రూ.70కి, డీజిల్‌ రూ.60కి అందిస్తామని చెప్పారు. కేంద్ర సెస్‌ వల్ల రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన 41శాతం వాటా కోల్పోయమన్నారు. ఇప్పటికే సెస్‌ రూపంలో వసూలు చేసిన రూ.30లక్షల కోట్లు సరిపోవా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో భాజపాయేతర పార్టీలు పాలిస్తున్న ఆరు రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ తగ్గించలేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ గురువారం లోక్‌సభలో వెల్లడించిన విషయం తెలిసిందే. అందువల్లే ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినట్లు హర్దీప్‌ సింగ్‌ గుర్తుచేశారు. దీనికి కొనసాగింపుగా కొన్ని రాష్ట్రాలు ప్రజలపై భారం తగ్గించడం కోసం వ్యాట్‌ (VAT)ను సైతం తగ్గించాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని