Updated : 06 Jul 2022 10:10 IST

KTR: గ్యాస్ బండపై బాదుడు.. కేటీఆర్‌ సెటైరికల్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ విధానాలను తరచూ తనదైన శైలిలో ఎండగట్టే తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. తాజాగా మరో సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు రూ.50మేర పెంచిన నేపథ్యంలో ఆయన ట్విటర్‌లో స్పందించారు. 

‘‘మంచి రోజులు వచ్చేశాయ్‌ (అచ్చేదిన్‌ ఆగయా).. అందరికీ శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్ ధరను కేంద్రం పెంచేసింది. ప్రధాని సిలిండర్‌ ధర పెంచి మహిళలకు కానుకగా ఇచ్చేశారు’’ అని కేటీఆర్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. తాజాగా పెంపుతో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,055 నుంచి రూ.1,105కు చేరిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని