KTR: తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోంది: మంత్రి కేటీఆర్
కేంద్రంలోని భాజపా ప్రభుత్వపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉపాధి హమీ నిధులు నొక్కిపెడుతూ.. తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
సిరిసిల్ల: దేశంలోనే తెలంగాణ గ్రామాలు అభివృద్ధికి చిరునామాగా మారాయని ఐటీ, పురపాలక శాక మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా వరుసగా మూడు సార్లు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ జిల్లా పరిషత్‌గా నిలవడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీలు సాధించిన ప్రగతి.. ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో పాఠ్యాంశాలుగా బోధిస్తుడడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఈ మేరకు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వరుసగా మూడుసార్లు దేశంలోనే అత్యుత్తమ జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచిందని కేటీఆర్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి వల్లే ఈ పురస్కారాలు వస్తున్నాయన్నారు. గతంలో ఉత్తమ గ్రామాలుగా గంగదేవిపల్లి, అంకాపూర్ మాత్రమే ఉండేవని.. ఇప్పుడు అనేక గ్రామాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయని తెలిపారు. రూ.కోటి లోపు ఉన్న బకాయిలన్నీ వెంటనే విడుదల చేస్తున్నామని వెల్లడించారు. మొత్తం రూ.1300 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపైనా మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులను కేంద్రం నొక్కిపెడుతోందని ధ్వజమెత్తారు.
కేటీఆర్ కాన్వాయ్ అడ్డగింత..
సిరిసిల్ల పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పేపర్ లీకేజీ కేసులో బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Maharashtra: మహారాష్ట్ర రైతుల కోసం కొత్త పథకం.. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం
-
Politics News
Shiv Sena: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ అలజడి..ఆసక్తి రేపుతున్న శివసేన నేతల వ్యాఖ్యలు!
-
General News
Cyber Crimes: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ ‘5s’ ఫార్ములా మీ కోసమే!
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!
-
Politics News
Andhra News: మరోసారి నోరు జారిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి