KTR: తెలంగాణకు ఏమీ ఇవ్వని మోదీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఇచ్చేది లేదని చెప్పిన ప్రధాని మోదీ, భాజపా మనకెందుకని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

Updated : 30 Mar 2023 17:20 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మరో సారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ ప్రాధాన్యతలో తెలంగాణ లేదని.. అలాంటప్పుడు రాష్ట్ర ప్రజల ప్రాధాన్యతలో మాత్రం ప్రధాని మోదీ, భాజపా ఎందుకుండాలని కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమీ ఇచ్చేది లేదని మోదీ సర్కారు తేల్చి చెప్పిందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు.

‘‘తెలంగాణకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఇవ్వనని మోదీ చెప్పారు. మెట్రో రెండో దశ, ఐటీఐఆర్‌, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చేశారు. రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదన్నారు. విభజన చట్టంలోని హామీలను మోదీ అమలు చేయట్లేదు. వీటన్నింటికీ రాష్ట్రంలోని నలుగురు భాజపా ఎంపీలు బాధ్యత వహించాలి. తెలంగాణకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు కానీ, ప్రధాని రాష్ట్రం గుజరాత్‌కు లోకోమోటివ్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి రూ.20వేల కోట్లు ఇచ్చారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్న ఫలితమిది’’ అని  మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు