KTR: సీఎం పదవికి రూ.2,500 కోట్లంటా.. నడ్డాజీ ఏమంటారు?: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు.

Updated : 07 May 2022 10:24 IST

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. తాజాగా ఇవాళ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘‘కర్ణాటకలో సీఎం కావాలంటే రూ.2,500 కోట్లు అడుగుతున్నారట. మీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 40 శాతం కమిషన్‌ ఇవ్వాలని గుత్తేదారులు, 30 శాతం కమిషన్‌ ఇవ్వాలని హిందూ మఠం వాళ్లు అంటున్నారు. వీటన్నింటిపై ఎలా స్పందిస్తారు?ఈడీ, ఐటీ, సీబీఐలకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

మరోవైపు తెలంగాణ పర్యటనకు వస్తున్న జాతీయ పార్టీ నేతల గురించి మాట్లాడుతూ.. ‘‘రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారు.. సీఎం కేసీఆర్‌ ఇక్కడే ఉంటారు’’ అని కేటీఆర్‌ మరో ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని