KTR: అప్పుడు మన్మోహన్‌ను.. ఇప్పుడు మోదీని అడిగాం: కేటీఆర్‌

ఓబీసీకి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కోరారు.

Updated : 18 Nov 2022 10:35 IST

హైదరాబాద్: ఓబీసీకి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ విషయంపై కేసీఆర్‌ ఆధ్వర్యంలో 2004 నుంచి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

గతంలో కేసీఆర్‌ నేతృత్వంలో ఓబీసీ సంఘాలు దిల్లీ వెళ్లి అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశాయని కేటీఆర్‌ గుర్తు చేశారు. దానికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్‌ చేశారు. అయితే అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వశాఖ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ఓబీసీ మంత్రిత్వ శాఖ కోసం ప్రధాని మోదీని కూడా కోరామని.. శాఖ ఏర్పాటు చేసి వచ్చే బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నామని ట్వీట్‌లో కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని