Minister KTR: భాజపాకు ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైంది: కేటీఆర్‌

కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్ నివేదికపై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు.

Published : 25 Mar 2023 15:37 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశ యువత చాలా నష్టపోతోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చైనా నుంచి బయటకు వస్తున్న వ్యాపారవేత్తలను ఆకర్షించడంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్ నివేదికపై ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ స్పందించారు. ఎన్‌పీఏ ప్రభుత్వానికి దేశ ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైందని పేర్కొన్నారు. రాజకీయానికి ప్రాధాన్యమిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఎద్దేవా చేశారు. టెలిప్రాంప్టర్ చూసి ప్రసంగించడం సులువే.. కానీ, పటిష్ఠ ప్రయత్నాలు లేకపోతే ఫలితాలు రావడం కష్టమని తెలిపారు. ఈ తరహా పరిస్థితులు దేశ యువతకు చాలా నష్టం కలిగిస్తాయని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని