KTR: ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాలి?: కేటీఆర్

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు.

Updated : 19 Apr 2022 09:57 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని ఎన్డీయే అసమర్థ పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దేశంలో 45 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం చేరుకుందని, 30 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం పెరిగిందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎల్పీజీ సిలిండర్‌ ధరలున్నాయని కేటీఆర్ విమర్శించారు. వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నామని ఆర్‌బీఐ నివేదిక చెబుతోందని.. ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమని పిలవాలని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రతిభ చూపించని ప్రభుత్వంగా ఎన్డీయే చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని