Mallareddy: నా హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారు: మంత్రి మల్లారెడ్డి
రెడ్ల సింహగర్జన సభలో తనపై దాడి చేసేందుకు కుట్ర చేశారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనను హత్య చేసేందుకు ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు
హైదరాబాద్: రెడ్ల సింహగర్జన సభలో తనపై దాడి చేసేందుకు కుట్ర చేశారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనను హత్య చేసేందుకు ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాస సంక్షేమ పథకాలు రెడ్లకు అందుతున్నాయని సభలో చెప్పానన్నారు. తనను ఎనిమిదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి నేరాలపై విచారణ చేసి జైలులో పెడతామన్నారు. తనపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మల్లారెడ్డి వివరించారు.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ శివారులో ఆదివారం సాయంత్రం రెడ్ల సింహగర్జన మహాసభ జరిగింది. దీనికి హాజరైన మంత్రి ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం మంత్రి వేదిక దిగి వెళ్లిపోతుండగా, వెంబడించి.. ఆయన వాహనశ్రేణిపై కుర్చీలు, చెప్పులు విసిరారు. అప్రమత్తతతో వ్యవహరించిన పోలీసులు ఆయనను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!