Niranjan Reddy: పాలమూరు-రంగారెడ్డిపై విపక్షాలది దుష్ప్రచారం: నిరంజన్‌రెడ్డి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు విశ్వప్రయత్నాలు చేశాయని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

Updated : 23 Sep 2023 17:46 IST

హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు విశ్వప్రయత్నాలు చేశాయన్నారు. ప్రాజెక్టును జూరాల నుంచి మొదలుపెట్టాలని మొదట విపక్షాలు వాదించాయని, అటవీప్రాంతంలో ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఫిర్యాదు చేశాయని అన్నారు. ‘‘ విపక్షాలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. చివరికి గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో సైతం ఫిర్యాదు చేశాయి. అన్ని విఘ్నాలు దాటుకొని ప్రాజెక్టు ప్రారంభించాం. ప్రాజెక్టు రీడిజైన్‌తో ముంపు ప్రాంతాల పరిధి తగ్గింది. తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా కేసీఆర్‌ దృష్టి పెట్టారు’’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు