TDP: తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల ఫోన్‌

తెదేపా సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ ఫోన్‌ చేశారు.

Updated : 19 Jun 2024 12:00 IST

అమరావతి: తెదేపా సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ ఫోన్‌ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని ఆయన్ను కోరారు. పయ్యావుల ప్రతిపాదనకు బుచ్చయ్య చౌదరి అంగీకారం తెలిపారు. ప్రొటెం స్పీకర్‌గా గురువారం ఆయనతో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

ఈనెల 21 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో బుచ్చయ్యచౌదరి ప్రమాణస్వీకారం చేయిస్తారు. సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. స్పీకర్‌ పదవికి మరో సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరు ఖరారైన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు