Andhra News: చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని ఏపీ పాలనపై మాట్లాడటమేంటి?: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని ఏపీ పాలనపై మాట్లాడటం ఏంటని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి

Updated : 30 Mar 2022 20:45 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని ఏపీ పాలనపై మాట్లాడటం ఏంటని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. విమర్శలు చేసే ముందు ప్రజల మనోభావాలను చంద్రబాబు తెలుసుకోవాలని పెద్దిరెడ్డి హితవు పలికారు. 2024లోనూ మరింత గొప్పగా వైకాపాకు విజయం అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుకు మాత్రమే ఏపీలో విధ్వంసక పాలన కొనసాగుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. డబ్బులతో ఎన్నికలకు వెళ్ళే సంస్కృతి తెలుగుదేశం పార్టీదేనని మంత్రి ఆరోపించారు. క్షేత్రస్థాయికి పాలనను తీసుకువెళ్లేలా సచివాలయ వ్యవస్థను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉగాది తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయన్నారు. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ కారణంగా అధికారులకు పాలనపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని పెద్దిరెడ్డి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని