Telangana News: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తే జాలేస్తోంది: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ

Published : 08 May 2022 02:00 IST

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తే జాలేస్తోందన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కంటే గొప్పగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏముందో చెప్తే బాగుండేదని మంత్రి అభిప్రాయపడ్డారు. రైతు పక్షపాతి ఎవరనే విషయం యావత్తు దేశ రైతాంగానికి తెలుసన్నారు. రాహుల్ తెలంగాణలో చెప్పిన మాటలు దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చెప్పాలని, అమలు చేసి చూపించాలని సవాల్ చేశారు.

‘‘రైతుల పక్షాన పార్లమెంటులో ఏ రోజూ మాట్లాడని రాహుల్ గాంధీ నేడు అల్లాఉద్దీన్ అద్భుత దీపం చేస్తానంటే తెలంగాణ ప్రజలెవరూ నమ్మరు. పొలిటికల్ టూరిస్టులకు కేసీఆర్ భయం పట్టుకుంది. మనుగడ కష్టమనే పార్టీలకు అతీతంగా తెలంగాణ మీద రాజకీయ మిడతల దండు దండయాత్ర చేస్తోంది. చావుకు సిద్ధపడ్డ కేసీఆర్ తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. తెలంగాణ విషయంలో అడ్డుపడాలని చూస్తే దేశవ్యాప్తంగా అగ్గి పుట్టిస్తాం. కేసీఆర్ లాంటి నాయకుడి సేవలు దేశానికి అవసరమని ప్రజలు, మేధావులు భావిస్తున్నారు. ఎప్పుడు ఏం చేయాలి.. ఎలా చేయాలి.. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాలు తెలిసినవారు తెలంగాణ ప్రజలు. పొలిటికల్‌ టూరిస్టుల మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరు’’ అని ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని